బండి సంజయ్ అరెస్ట్
లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గ్రూప్1 అభ్యర్థుల ర్యాలీలో గందరగోళం ఏర్పడింది. ఈ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బైఠాయించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్తత టోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ వంటి నాయకులు కూడా ఈ ర్యాలీకి రావడంతో ఈ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నేతలకు నిరసనల సెగ తగిలింది. జీవో 29 ను రద్దు చేయాలంటూ అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. దీనితో బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను కూడా అందుబాటులోకి తీసుకున్నారు.