ఉప్పాడ తీరంలో ఇళ్లను ముంచెత్తిన సముద్రం
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీగా అలలు ఎగసి పడడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేలకూలాయి. ఇళ్లలోకి సముద్రపునీరు ప్రవేశించింది. కోనసీమ జిల్లాలోని ఓడల రేవు తీరంలో సముద్రం ఉద్ధృతంగా ఉప్పొంగుతోంది. ఓఎన్‌జీసీ ప్లాంటును సముద్రపు నీరు తాకింది. ఆక్వా చెరువులను సముద్రం నీరు ముంచెత్తింది. అంతర్వేది గోదావరి సంగమం వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అక్కడ బీచ్ రోడ్డు, ఇళ్లను అలలు ముంచెత్తాయి. విశాఖలో కూడా బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

