జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూ కాశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్సీ శాసనసభాపక్ష నేతగా ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

