Home Page SliderNational

మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో మోగిన ఎన్నికల నగారా

దేశంలోని మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర మహారాష్ట్రలో నవంబర్ 20 న పోలింగ్ జరగనుంది. ఝార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 13న తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నారు.

మహారాష్ట్ర లో అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదలకానుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుందని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో 29 SC, 25 ST రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1,00,186 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయనున్నారు.

ఝార్ఖండ్ లో 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో జనరల్ 44 సీట్లు కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు.. 131 కోట్ల మంది పురుషులు, 66.84 లక్షల మంది యువ ఓటర్లు కాగా.. 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.