NationalNews

రష్మికకు అరుదైన అవకాశం

నేషనల్ క్రష్‌గా పేరు పొందిన నటి రష్మికకు అరుదైన అవకాశం వచ్చింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె నియమింపబడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె వీడియోను విడుదల చేశారు. దీనిలో ఆమె గతంలో ఎదుర్కొన్న డీప్ ఫేక్ వీడియో చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అప్పుడే ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. తాజాగా నేషనల్ ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం కూడా ప్రకటించారు.