Home Page SliderNational

అంతటా దహనం చేస్తే.. అక్కడ ఊరేగింపు

దసరా అనగానే అందరికీ రావణుడి దహనం గుర్తుకొస్తుంది. కానీ మహారాష్ట్రలోని కొడిశెలగూడెం గ్రామంలో మాత్రం రావణుడిని బ్రహ్మజ్ఞానిగా ఆరాధిస్తారు. దసరా రోజున రావణుడి విగ్రహానికి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ గ్రామంలో వేడుకలు జరిగాయి. త్రిమత ఏకైక గురువు, త్రైత సిద్ధాంత అధికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రభోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీలంక నుంచి బౌద్ధగురు హాజరు కాగా, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి త్రైత జ్ఞానులు పాల్గొని రావణుడిని స్మరిస్తూ జేజేలు కొట్టారు. జనక మహారాజుకు గురువు అయిన రావణునికి జై, సీతకు తండ్రియైన రావణునికి జై, ద్వాదశ గ్రహాలను (ప్రకృతి)ని శాసించిన శాసనకర్త రావణునికి జై, త్రికాల జ్ఞాని అంటూ ప్రత్యేక నినాదాలు చేయడం గమనార్హం.