సూర్య ‘కంగువ’ చిత్రంలో ఏఐతో డబ్బింగ్
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన ఫాంటసీ చిత్రం ‘కంగువా’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెల్లడయ్యింది. ఈ చిత్రంలో తమిళంలో సూర్య డబ్బింగ్ పూర్తి చేయగా, ఇతర భాషలలో ఏఐ సహాయంతో డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు నిర్మాత జ్ఞానవేల్ పేర్కొన్నారు. కంగువా చిత్రాన్ని 8 భాషలలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో దిశాపఠానీ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, బాబీ దేవోల్, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య 6 భిన్నమైన అవతారాలలో కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ,ఇంగ్లీష్ భాషలతో పాటు ఫ్రెంచ్, స్పానిష్లలో కూడా విడుదల కానుంది. చైనీస్, జపనీస్ భాషలలో కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.