Home Page SliderNewsTelangana

బతుకమ్మలతో మంత్రి సీతక్క

ట్యాంక్ బండుపై నేడు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ (సీతక్క) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలి పూజ నిర్వహించి ట్యంక్ బండ్ పై ఉన్న ప్రధాన వేదిక వరకు ర్యాలీగా తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. తెలంగాణ అంటేనే చెరువులు. తెలంగాణ అంటేనే వాగులు వంకలు అడవులు, గుట్టలు. చెరువులు నిండితే నే మన పంటలు పండేది. ఆ పంటల నవధాన్యాలు తెచ్చి ఆడి పాడే పండగ బతుకమ్మ. ఆడబిడ్డలను కడుపార చూసుకునే పండుగ బతుకమ్మ. గునుగు పువ్వు, కట్ల పువ్వు, శంకుపూవు లో భిన్నమైన ఎప్పుడైనా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నీ చెరువులో చేరితే నీరు శుద్ధి అవుతుంది. బతుకమ్మతో అనుబంధం గా ఉండే చెరువులను కాపాడుకుందాం. బతుకమ్మను చెరువులను భవిష్యత్ తరాలకు అందిద్దాం. తెలంగాణ పూల పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాం. అలాగే మహిళలను రక్షించుకుందాం, మహిళలకు అండగా ఉందాం. అమ్మాయిలను బతకనీయండి చదవనీయండి ఎదగనీయండి. ఆడ కూతుర్లను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అని పేర్కొన్నారు.