యాసిడ్ దాడి చేస్తానన్నాడు.. ఉద్యోగం లోంచి పీకేశారు
కొన్నిసార్లు కొన్ని విషయాలతో వారి జీవితాలు ఆగమాగమవుతాయ్. కావాలని ఏదిపడితే అది చేస్తే కేవలం వారి జీవితాలే కాదు కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతాయి. బెంగళూరులో ఒక ఉద్యోగి, తోటి ఉద్యోగిని పలానా డ్రస్ ధరించి రావాలి లేదంటే యాసిడ్ పోస్తానని బెదిరిచడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సంస్థ సదరు ఉద్యోగిని ఉద్యోగంలోంచి ఊడబీకింది. పైపెచ్చు పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేసింది. ఏ బట్టలు వేసుకోవాలన్నదానిపై నికిత్ శెట్టి అనే వ్యక్తి, తన భార్యను హెచ్చరించడాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కంపెనీ రంగంలోకి దిగింది. దీంతో కంపెనీ గట్టిగా రియాక్ట్ అయ్యింది. ఇతరుల ఎంపిక విషయంలో జోక్యాన్ని సంస్థ ఆమోదించదు. అంగీకరించబోదని తేల్చి చెప్పింది.