కొడంగల్ లో ఉద్రిక్తత
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పాదయాత్ర నిర్వహించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం నుంచి దుద్యాల మండలం వరకు పాదయాత్ర నిర్వహించేందుకు నేతలు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి పాదయాత్రలో పాల్గొనేం దుకు బయలుదేరిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులను తుంకిమెట్ల గ్రామం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.