సంగారెడ్డిలో శిశువు అపహరణ
సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మంగళవారం నాడు రాత్రి శిశువు అపహరణకు గురయ్యింది. ఈ సంఘటన కలకలం రేపింది. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే మహిళకు నాలుగవ కాన్పు జరిగింది. సిజేరియన్ ద్వారా ఆడశిశువు జన్మించింది. అయితే కాసేపటికే ఆ శిశువు మాయమవడం కలకలం రేపింది. బాధిత మహిళ, ఆసుపత్రి వైద్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. వారే శిశువును ఎత్తుకెళ్లారని అనుమానించారు. దర్యాప్తు చేస్తున్నారు.