కుమార్తెతో దుర్గమ్మ దర్శనానికి పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి బెజవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నేడు నవరాత్రులలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారంతో అమ్మవారు దర్శనమిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్‌లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.

