Home Page SliderTelangana

నాంపల్లి కోర్టులో నాగార్జున కీలకవ్యాఖ్యలు

నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున కుటుంబం హాజరయ్యారు. నాగార్జున వెంట నాగచైతన్య, ఆయన భార్య అమల కూడా హాజరయ్యారు. సాక్షులుగా సుప్రియ, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నాగచైతన్య, సమంతల విడాకులపై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా వేశారు. అయితే నేడు నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో నాగార్జున కోర్టుకు హాజరయ్యారు. ఎందుకు కేసు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఆయన తమ కుటుంబానికి ఎన్నోఏళ్లుగా పరువు మర్యాదలు ఉన్నాయని, వాటిని మంటగలిపేలా మంత్రి కొండా సురేఖ అసత్య వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు నాగార్జున. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. కేటీఆర్ వల్లే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.