Home Page SliderTelangana

ఆలసించిన ఆశాభంగం..  వీటిని మూలపడేస్తున్నారా?

తుప్పు పట్టిన వాహనాలను మూల పడేస్తున్నారా? ఇక ఆలస్యం చేయకండి. ఆలసించిన ఆశాభంగం. వీటిని వెంటనే వాలంటరీ స్క్రాపింగ్ చేసేయండి. ఎందుకంటే ప్రైవేటు వాహనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా MV ట్యాక్స్ మినహాయింపు, సమయానుసారంగా వాహనాలను స్కాపింగ్ చేయడాన్ని ప్రోత్సహించడం లాంటి రెండు రకాల రాయితీలను అందిస్తోంది. మొదటి రకమైన రాయితి వాహనాన్ని స్కాపింగ్ చేయడం ద్వారా మోటార్ వాహన పన్ను మినహాయింపు పొందడం. అలాగే కొత్త వాహనం కొనుగోలుకు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ సమర్పణ చేయడం.  రెండవ రాయితి కొన్ని పెనాల్టీలను మాఫీ చేయడంలో ఉంటుంది.  వాహనాల స్క్రాపింగ్ ను ప్రోత్సహించడానికి గాను, వాహనంపై ఉండి గ్రీస్ ట్యాక్స్‌, క్వార్టరీ పన్నుపై పెనాల్టీని మినహించడం ప్రోత్సాహకంగా ఇప్పటి నుండి రెండు సంవత్సరాల లోపు స్క్రాపింగ్ చేసిన వాహనాలకు ఈ రాయితీలు వర్తిస్తాయి.

ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్ విధానం కూడా మొదలుపెట్టింది. ప్రభుత్వ వాహనాలను ఇ-ఆక్షన్ ద్వారా దశలచారిగా తొలగించడం. 1989 సెంట్రల్ మోటార్ వాహనాల నియమాలు (CMVR) రూల్ 52A కింద అమలు చేయబడుతుంది. దీని ప్రకారం వాహనాలను సుదీర్ఘ కాలం ఉపయోగించిన ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగిస్తారు. 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలు స్క్రాప్‌కి తప్పనిసరిగా  పంపించాలి..

ప్రైవేట్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనం స్క్రాపింగ్ చేసిన తరువాత అదే క్యాటగరీలో కొత్త వాహనం కొంటే రాయితీలు వర్తిస్తాయి. కొత్త వాహనానికి ఈ విధంగా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.

స్కూటర్( 2 వీలర్స్)

1 లక్ష లోపు రూ.1000

1-2 లక్షలు  రూ.2000

2-3 లక్షలు  రూ.3000

కార్స్ (4 వీలర్స్)

5 లక్షల లోపు రూ.10000

5-10 లక్షలు  రూ.20000

10-15 లక్షలు  రూ.30000

15- 20 లక్షలు ఆ పైన రూ.50000

కొత్త వాహనాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.