Home Page SliderNational

హర్యానాలో అన్ని కోట్లిచ్చారు. ఇక్కడెందుకివ్వరు?

మహారాష్ట్రకు చెందిన పారిస్ ఒలింపిక్ కాంస్య పతక విజేత షూటర్ స్వప్నిల్‌కు ఇచ్చిన ప్రైజ్‌మనీపై వివాదం నెలకొంది. అతని తండ్రి ఇది సరిపోదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానాలో ఒలింపిక్ విజేతలకు కోట్ల కొలది ప్రైజ్ మనీ ఇచ్చారని పేర్కొన్నారు. మహారాష్ట్ర కంటే హర్యానా చిన్న రాష్ట్రమని, అయినా వారి అథ్లెట్లకు ఇచ్చిన మొత్తంతో పోలిస్తే తన కుమారునికిచ్చినది చాలా తక్కువన్నారు. స్వప్నిల్‌కు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఆయన విమర్శలు కురిపించారు. స్వప్నిల్‌కు రూ.5 కోట్లు, పూణె బలేవాడీలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో ఒక ఫ్లాట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. గత 72 ఏళ్లలో మహారాష్ట్ర నుండి ఒలింపిక్స్‌లో పతకం సాధించినవారిలో రెండవ వ్యక్తిగా నిలిచారు స్వప్నిల్. హర్యానా నుండి రజత, కాంస్య పతకాలు సాధించిన నీరజ్ చోప్రా, మనుబాకర్‌లకు భారీ ఎత్తున పారితోషకాలు, ప్రైజ్‌మనీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.