ఓర్నీ ఇంతలోనే తప్పైపోయిందంటున్న మాల్దీవులు అధ్యకుడు
తత్వం బోధపడితే కానీ ఎవరికైనా అసలు విషయం తెలియదు. అప్పటి వరకు ఎగిరిగంతులేసిన వారే, అవసరం కోసం విధానాలు మార్చుకుంటారు. మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు కూడా అందుకు అతీతుడు కాడు. ఇండియాపై విషం జల్లిన ఆయన ఇప్పుడు భారత్ అంటే వల్లమాలిన ప్రేమ అంటున్నారు. తొలిసారి ఇండియా పర్యటనకు వచ్చిన ఆయన భారత్ అంటే తమకు అమిత గౌరవమన్నారు. మొన్నటి వరకు చైనా పాట పాడిన ఆయన ఇప్పుడు ఇండియాతో కలిసి పనిచేస్తామంటున్నారు. భారతదేశ భద్రత విషయంలో, మాల్దీవులు ఎప్పుడూ మిత్రుడుగా కలిసి పనిచేస్తుందన్నారు. రెండు దేశాలు సమస్యల పరిష్కారం కోసం కలిసి ముందుకు సాగుతాయన్నారు. గత ఎన్నికల్లో ఇండియా వద్దంటూ ఎన్నికల ప్రచారం చేసిన ఆయన, చైనా అనుకూలురన్న అభిప్రాయం ఉంది.

