ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య..అదే కారణం
నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలానికి చెందిన వడ్డేపల్లిలో విషాదసంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అని తెలుస్తోంది. హరీష్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లో రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు తమ పొలం కూడా అమ్మేశారని సమాచారం. అయినా అప్పులు తీరకపోవడంతో ముగ్గురూ కలిసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.