ఇక నుంచి షార్ట్స్ లో 3 నిమిషాల వీడియోలు
ప్రముఖ వీడియో ప్లాట్ ఫాం యూట్యూబ్ తన షార్ట్స్ లో కీలకమైన ఫ్యూచర్ ను తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్ క్రియేటర్లు మూడు నిమిషాల వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చునని యూట్యూబ్ ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ కంటెంట్ లో యూజర్లకు మరింత చేరువ కావడానికి వెసులుబాటు కలగనుంది. యూట్యూబ్ షార్ట్స్ ను తీసుకొచ్చిన కొత్తలో కేవలం 60 సెకన్లలోపు వీడియోలపై మాత్రమే యూట్యూబ్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్ల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజాగా నిడివిని మూడు నిమిషాలకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.