Home Page SliderTelangana

వివాదాన్ని ఇంతటితో ఆపేయండి..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు అందరూ ఖండిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సినిమా ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగించాలని ఆయన ఇండస్ట్రీని కోరారు. మంత్రి కొండా సురేఖ బేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వివాదంలో ఇరువైపులా ఉన్నది మహిళలే అని, ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.