మూసీ నదిని బిట్లు బిట్లుగా అమ్ముకున్నారు..
మూసీ ప్రక్షాళనపై కేటీఆర్, హరీశ్ చేస్తున్న రాద్దాంతంపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూసీ నదిని బిట్లు బిట్లుగా లక్షలు, కోట్ల రూపాయలకు అమ్ముకున్నది మీ పార్టీ వాళ్లు కాదా అని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హియాయత్ సాగర్ జంట జలాశయాలను సైతం కబ్జా చేసింది మీరు కాదా అంటూ కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం విరుచుకుపడ్డారు. మీలాంటి బలిసినోళ్ల ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటిని మూసీ పక్కన ఉండే పేదలు తాగాలా అంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.

