Home Page SliderNational

`హిట్-3` లో విల‌న్ పాత్రకి ఎంపికైంది ఎవరు…?

నేచుర‌ల్ స్టార్ క‌థానాయ‌కుడిగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో `హిట్-3` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. నానీ క‌థానాయ‌కుడిగా అంటే, హిట్‌ సినిమాగా మార్కెట్‌లో ఓ బ్రాండ్‌ ఐపోయింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు భాగాలు భారీ విజ‌యం సాధించాయి. సినిమాని అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా నాని త‌న సొంత బ్యాన‌ర్ వాల్ పోస్ట‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైజాగ్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. అడ‌వి వ‌రం సెంట్ర‌ల్ జైల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది.

ఈ సినిమాలో ప్ర‌ధాన విల‌న్ ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. క్రైమ్‌ని ఆర్గ‌నైజ్ చేసే ఆ పాత్ర అంటే సినిమాకి ఎంతో కీల‌కం. ఆ పాత్ర‌ని బేస్ చేసుకునే హీరో రోల్ కీల‌కం కానుంది. మ‌రి అలాంటి ఇంట్రెస్టింగ్ రోల్‌కి ఎవ‌రు ఎంపిక‌య్యారు అంటే? బాలీవుడ్ నటుడు, `మీర్జాపూర్`  ఫేమ్ అలీ ఫజల్‌ని తీసుకున్నారు. అలీ ఫ‌జ‌ల్ అతి త్వరలో సెట్స్‌లో పాల్గొంటాడు. న‌టుడిగా అత‌డికి మంచి పేరుంది. ఈ నేప‌థ్యంలో అత‌డి ఎంట్రీ హిట్-3 కి క‌లిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి. సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఈ సినిమా అనంత‌రం నాని.. శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయనున్నారు.