Home Page SliderNational

దసరా సెలవలు..స్కూల్ యాజమాన్యాలకు వార్నింగ్

రేపటి నుండి స్కూళ్లకు దసరా సెలవలు ప్రారంభం కానున్నాయి. రేపు గాంధీ జయంతి కావడంతో రేపు కూడా సెలవు. ఈ నెల 13 వరకూ ఏపీలో ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. తెలంగాణలో 14 వరకూ బతుకమ్మ, దసరా సెలవులుగా ప్రకటించారు. దీనితో తెలుగు రాష్ట్రాలలో సందడి నెలకొంది. హైదరాబాద్‌ నుండి ఏపీలోని సొంతవూర్లకు ప్రయాణాలు కడుతున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.