‘ఆకూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు’..రంగనాథ్ హెచ్చరిక
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెట్టవద్దని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఎక్కడ ఏ కూల్చివేతలు జరిగినా దానిని హైడ్రాతో ముడిపెట్టి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను హైడ్రా ఖండిస్తోందన్నారు. ఎక్కడో హోర్డింగ్ కారణంగా గాయమై, ఎవరో చనిపోతే హైడ్రా బలితీసుకుందని రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కూల్చివేతలు సంబంధం లేదన్నారు. హైడ్రా సాధారణ ప్రజలకు ముందస్తు నోటీసులు లేకుండా, ఎలాంటి చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు.

