తెలంగాణ మంత్రి ఇంటిపై ఈడీ సోదాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ తనిఖీలు చేస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేపట్టాయి. వ్యాపార సంస్థల కార్యాలయాలు, హిమాయత్ సాగర్ లోని ఆయన ఫాంహౌస్ తో పాటు బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి కుమార్తె నివాసంలో తనిఖీలు సాగుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తనిఖీల సందర్భంగా ఎలాంటి గొడవ జరగకుండా సీఆర్పీఎఫ్ పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.