సంజయ్ రౌత్ కు జైలు శిక్ష
శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబై కోర్టు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య సతీమణి మేధా రౌత్ పై పరువు నష్టం దావా వేశారు. కేసు విచారించిన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం దోషిగా నిర్ధారిస్తూ.. 15 రోజుల సాధారణ జైలు, 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మేధా ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. ముంబై శివారులోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.100 కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ శివసేన పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అంతకు ముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తోన్న స్వచ్చంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దీనిపై మేధ కోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.

