తెలంగాణలో తిరుమల లడ్డూ ఎఫెక్ట్
తిరుమల లడ్డూకు ఉపయోగించిన నెయ్యి కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం కూడా సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఆలయాలలో వినియోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ వంటి పదార్థాలను తనిఖీ చేయాలని నిర్ణయించింది. లడ్డూలు, ఇతర ప్రసాదాలకు వాడే పదార్థాలను ల్యాబ్‌కు పంపించి, తనిఖీలు చేయించాలని, వీటన్నింటికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయా డెయిరీ ఉత్పత్తులనే వాడాలని ఆదేశించింది. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాలను విజయ డెయిరీ నుండే కొనుగోలు చేయాలని ఆయా దేవస్థానాలకు స్పష్టం చేసింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య అధ్వర్యంలోని విజయ డెయిరీ నడుస్తోంది. ఆలయాల ట్రస్టులు, ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థలతో టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకమీదట అన్నీ తనిఖీలు జరుగుతాయని హెచ్చరించింది.

