Andhra PradeshHome Page Slider

మూకుమ్మడిగా కొండపైకి పారిపోయిన 40 మంది విద్యార్థులు..పోలీసులు షాక్

పల్నాడు జిల్లాలోని వంకాయల పాడులో గురుకుల పాఠశాల విద్యార్థులు 40 మంది ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. దీనితో ఉపాధ్యాయులు గాబరాపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూలు, హాస్టల్ ఒకే కాంపౌండులో ఉండడంతో వీరు కనిపించక చాలా కంగారు పడ్డారు. అయితే వీరంతా దగ్గరలోని కొండమీదకు పారిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. వారు కొండమీదకు చేరి, ఎందుకు కొండెక్కారని అడుగగా వారు చెప్పిన సమాధానంలో పోలీసులు షాక్ తిన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంతరావు తరచూ వేధిస్తున్నారని, చిన్నచిన్న విషయాలకే కొడుతున్నారని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. దీనితో వారిని బుజ్జగించి కొండ దింపి, టీచర్లకు, విద్యార్థులకు, ప్రిన్సిపాల్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిని చిన్నవిషయాలకే కొట్టవద్దని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇలా 40 మంది కొండపైకి వెళ్లడంపై వెనక ఎవరి పాత్ర ఉందనేది ఆరా తీస్తున్నారు.