శని,ఆదివారాల్లో ఐదు గంటల ఇంటర్నెట్ బంద్.. ఎందుకంటే..
ఝార్ఖండ్ రాష్ట్రంలో శని,ఆదివారాల్లో ఐదు గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే అప్పుడు జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ (జేజీజీఎల్సీసీఈ) రిక్రూట్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు ఐదు గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేసింది. ఈ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 823 కేంద్రాల్లో జరుగుతోంది. 6.39 లక్షలమంది హాజరవుతున్నారు. శని, ఆది వారాల్లో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకూ ఇంటర్నెట్ నిలిచపోనుంది. పరీక్షలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ముక్యమంత్రి హేమంత్ సోరెన్ వెల్లడించారు. పరీక్ష నిర్వాహకులు కూడా ఎలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. గతంలో నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ ఘటనపై తీవ్రదుమారం చెలరేగి, సుప్రీంకోర్టు వరకూ చేరిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఝార్ఖండ్ సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తోంది.

