పాపం తగులుతుంది. పోతార్రేయ్… అంతకంతకూ అనుభవిస్తారంటున్న యువ క్రికెటర్ తండ్రి
పాకిస్తాన్ క్రికెటర్ ఈ మధ్య తెగ పాపులర్ అవుతున్నాడు. బాగా ఆడినందుకు కాదు.. కొంచెం లావుగా ఉండటం వల్లే. కొంచెం కాదు.. బాగానే లావుగా ఉంటం వల్ల. పాకిస్తాన్ లో ఇంజమాముల్ హక్ లాంటి ఆటగాళ్లు భారీ కాయంతో ఉన్నప్పటికీ సత్తా చాటేవారు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లుగా చలామణీ అయ్యారు. ఆస్ట్రేలియ దిగ్గజం డేవిడ్ బూన్ భారీకాయంతో ఉన్నప్పటికీ ఒంటి తెచ్చో మ్యాచ్‌లు గెలిపించాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ యువ క్రికెటర్ అజమ్ ఖాన్ జట్టులో చోటు కోల్పోవడం చర్చనీయాంశమైంది. ఆ యువ క్రికెటర్ మాజీ పాకిస్తాన్ కెప్టెన్ మొయిన్ ఖాన్ తనయుడు కావడమే అందుకు కారణం.

అన్నెం పున్నెం ఎరగని తన తనయుడిని జట్టులోంచి తొలగించిన పాపం మాజీ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాకు తగులుతుందంటూ మొయిన్ ఖాన్ శాపాలు పెడుతున్నాడు. యువ క్రికెటర్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకునేలా చేశారంటూ ఆయన దుయ్యబట్టాడు. తన కుమారుడికి జట్టులో చోటు దక్కకపోవడం వెనుక, క్రికెట్ బోర్డు పెద్దల అజ్ఞానం ఉందని ఫైరయ్యాడు. కట్ చేస్తే భారీకాయంతో ఉన్న అజమ్ ఖానీ, మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకోవాల్సింది పోయి, అపఖ్యాతిపాలయ్యాడు. తన కెరీర్ తనే క్లోజ్ చేసుకునేంత పాపులర్ అయ్యాడు. తన కుమారుడిని జట్టులోంచి తొలగించడం పట్ల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మెయిన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పటి ఛైర్మన్ రమీజ్ రాజా వల్లే తన కుమారుడికి జట్టులో చోటు పోయిందని మొయిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు.

ఒక్క మ్యాచ్ ద్వారానే ఒక క్రికెటర్ జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అజమ్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లను తొలగించాలని మొయిన్ ఖాన్ డిమాండ్ చేశాడు. కానీ ఆ ధైర్యం వారికి లేదని, కేవలం ఆటగాడిపైనే వేటు వేస్తున్నారని విరుచుకుపడ్డాడు. అజమ్ ఖాన్ భారీ కాయంతో ఉన్నప్పటికీ చక్కగా ఆడగలడని, అవకాశాలిస్తే, పాకిస్తాన్ జట్టులో మరో స్టార్ ఆటగాడిగా మారతాడని తండ్రి ప్రేమను చాటుకున్నాడు మొయిన్ ఖాన్. వికెట్ కీపర్-బ్యాటర్ అజమ్ బాడీ షేమింగ్‌తో అపఖ్యాతి పాలయ్యాడు. లావుగా ఉంటే పోనీ, కానీ ఆట ఏమైనా ఆడాడంటే అది కూడా లేదు. ఇటీవల జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ పేలవమైన ప్రదర్శనతో జట్టులోంచి పాక్ మేనేజ్మెంట్ తొలగించింది.

జులై 2021లో అరంగేట్రం చేసినప్పటి నుండి 14 T20I మ్యాచ్‌లలో, అజమ్ 8.80 సగటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు. అత్యుత్తమ స్కోరు 30 పరుగులు నాటౌట్ మాత్రమే. ఆజామ్ 2024 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ తరపున ఏకైక గేమ్‌లో సున్నా స్కోర్ చేశాడు. దీంతో తర్వాత జట్టు నుంచి తప్పించారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన T20 లీగ్ మ్యాచ్‌లలోనూ ప్రభావం చూపలేకపోవడంతో ఆయా జట్లు అజమ్ అంటే వామ్మో అంటున్నాయి.

