Home Page SliderNational

ఏపీ, తెలంగాణకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి

ఏపీ, తెలంగాణాలకు మరో రెండు వందేభారత్ రైళ్లను అందిస్తామని గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కానుక అందించినట్లు తెలిపారు. ఈ నెల 16న ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభిస్తారు. నాగ్‌పూర్-హైదరాబాద్, దుర్గ్- విశాఖపట్నం మధ్య ఈ రెండు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దేశంలో వందేభారత్ రైళ్ల విషయంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుండే ఎక్కువ సంఖ్యలో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.