‘ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్’..సీఎం
తెలంగాణ రాష్ట్రం గత పది రోజుల పాటు వరద ముంపులో విలవిల్లాడింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమయ్యింది. దీనితో వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందానికి పలు విజ్ఞప్తులు చేశారు. వాటిలో విజయవాడ తరహాలో ఖమ్మం మున్నేరు వాగుకు కూడా రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ప్రతిపాదించారు. ఈ వరదల కారణంగా తీవ్రనష్టం జరిగిందని, ఎలాంటి నిబంధనలూ లేకుండా తక్షణ సహాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్రం యుద్ధ ప్రాతిపదికపై యాక్షన్ ప్లాన్ రూపొందించి తెలంగాణను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని, దీనికోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని కోరారు.


