HealthHome Page Slider

మీరు చికెన్ తింటున్నారా? జర జాగ్రత్త !

నాన్ వెజ్ తినేవారిలో చాలా మంది చికెన్ ను చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ప్రియుల్లో కొందరు వారంలో 3, 4 సార్లు చికెన్ తింటే.. మరి కొందరు వారంలో ఒకటి, రెండు సార్లైనా తింటారు. కొందరికైతే రోజూ చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే చికెన్ కు సంబంధించి అమెరికాకు చెందిన ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనంలో చికెన్ ప్రియులకు షాకిచ్చే విషయాలు వెల్లడయ్యాయి. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ మితంగా తింటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయని.. కానీ ప్రతి రోజూ చికెన్ తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. రిహాబిలిటేషన్ సైన్సెస్ 35 వేల మంది అమెరికన్ల ఆహారపు అలవాట్లపై పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది. చికెన్ ఎక్కువగా తినేవారిలో మధుమేహం, రక్తనాలాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. అతిగా తింటే శరీరంలో హానికర కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. గుండె సమస్యలు, హైపర్టెన్షన్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే.. చికెన్ తక్కువగా తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.