Home Page SliderTelangana

మూడవ సారి 16వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి…

16వ ఫైనాన్స్ కమిషన్ ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరైన బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాష్ రెడ్డి. మూడవ సారి 16 వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చింది. 2014 మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక.. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ఉంది అని మొదటి నీతి ఆయోగ్ మీటింగ్ లోనే చెప్పారు. దానికి అనుగుణంగా టాక్స్ డేవల్యూషన్ 32 శాతం నుండి 42 శాతంకి పెంచి రాష్ట్రాల అభివృద్ధి చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు 2.9 శాతం ట్యాక్స్ షేర్ వస్తే. 15 వ ఆర్థిక కమిషన్ 2.43 ట్యాక్స్ షేర్ ఇస్తే ఇప్పుడు అది ఇప్పుడు 2.1 గా మారింది కాబట్టి ప్రగతి శీల రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలి అని కోరాం. ట్యాక్స్ ఎక్కువ కడుతున్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలని కోరాం. జనాభా పెరుగుదలలో సౌత్ తక్కువ. దాని గీటురాయిగా కాకుండా నిధులు కేటాయించాలి. తెలంగాణలో 89 శాతం వీకర్ సెక్షన్ ప్రజలున్నారు. ఓబీసీ లకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరాం.