“సారీ” చెప్పిన నెట్‌ఫ్లిక్స్..ఇకపై అలాంటి పేర్లు పెట్టం..
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఐసీ 814 కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ వివాదంలో చేరుకుంది. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ కేంద్రానికి “సారీ” చెప్పింది. ఎమ్‌ఐబీ అధికారులతో సంస్థ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ సమావేశమయ్యారు. ఈ వెబ్ సిరీస్‌లో హిందువుల భగవంతుడైన పరమేశ్వరుని పేర్లయిన బోలా, శంకర్ అనే పేర్లను టెర్రరిస్టులకు వాడడంపై కేంద్రం ఆమెకు నోటీసులు ఇచ్చింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, తప్పుడు కోణంలో చూపొద్దని సీరియస్ అయ్యింది. ఇకపై ఇలాంటి కంటెంట్ విషయంలో జాగ్రత్తగా సమీక్షిస్తామని, ప్రజల సెంటిమెంటును అనుసరించి నడుచుకుంటామని క్షమాపణలు చెప్పింది. ఈ వెబ్ సిరీస్‌లో నసీరుద్దీన్, విజయ్ వర్మ, అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించారు. 1999లో భారత్‌కు చెందిన విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూప్ హైజాక్ చేసింది. ఈ నిందితులందరూ ముస్లింలే. అయితే వారికి ఎందుకు హిందూ పేర్లయిన భోళా, శంకర్ పేర్లను పెట్టవలసి వచ్చిందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.