“వరదలో పురిటి నొప్పులు”..దేవుళ్లా ఆదుకున్నారు
భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ విలవిల్లాడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఒక గర్భిణి మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వరదలో చిక్కుకుపోయిన స్థితిలో అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి వచ్చింది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి ఈ సంగతి వచ్చింది. దీనితో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పడవలో ఆమె వద్దకు చేరుకునేసరికే ఆమెకు ప్రసవమయ్యింది. దీనితో అప్పుడే పుట్టిన శిశువును, తల్లిని పడవలో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు. దేవుళ్లా ఆదుకున్నారంటూ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.