Home Page SliderTelangana

సంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు..

సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా ఝళిపించారు. అమీన్‌పూర్‌ (మం)ఐలాపూర్ తండాలో దాదాపు 20 ఎకరాల ఆక్రమిత భూమి కబ్జాకి గురైనట్టు కమిషనర్ దృష్టికి వచ్చింది. సర్వేనెంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు చేశారని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో రంగంలోకి హైడ్రా దిగింది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ నిర్మాణాలు, సరిహద్దు రాళ్ళను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పలువురి బిల్డర్స్ పై కేసులు నమోదు చేశారు.