పింఛన్ల పంపిణీపై ఉద్యోగులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రదేశాలలో పింఛన్ల పంపిణీ విషయంలో ఉద్యోగులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా ఉంటే, ఒకటి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని తెలిపారు. టార్గెట్లు పెట్టవద్దని, వారిపై ఒత్తిడి చేయవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాలలో యథావిధిగా పంపిణీ కొనసాగించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 నుండి అనర్హుల పింఛన్లు తొలగించి, అర్హులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం కావడం వల్ల ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.

