ఏపీలో కొత్త మద్యం పాలసీ వస్తే ఏం జరుగుతుంది?
ఏపీలో కొత్త మద్యం పాలసీ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మద్యం పాలసీ వస్తే తమ బతుకులు బజార్ల పడతాయంటూ 15 వేల మంది ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమను ఇంటర్యూ ద్వారా ఎంపిక చేసిందని, ఇప్పుడు ఆ ఉద్యోగం పోతే తమ గతేంటని, ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్ 7 నుండి మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. టీడీపీ వర్గాల వాదన ప్రకారం అప్పుడు వైసీపీ కార్యకర్తలకు, బినామీలకు మద్యం కాంట్రాక్టులు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాల్సిందే.. అని డిమాండ్ చేస్తున్నారు.