నాని హీరోయిన్ ఫిదా..?
ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెదికినా అందులో ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ సాంగ్‌కి సంబంధించిన సీన్స్ కనిపిస్తాయి. ఇంతలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సాంగ్‌కి కామన్ ఆడియెన్స్‌తో పాటు సెలెబ్రిటీలు సైతం ఫిదా ఔతూ, రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ల రొమాంటిక్ మెలోడీ సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్‌తో ఒక ట్రెండ్‌ని సృష్టిస్తోంది. ఐతే, అందరూ డ్యాన్స్ చేస్తూ ఈ సాంగ్‌ను రీల్స్‌గా తీస్తుంటే, న్యాచురల్ స్టార్ నానితో హీరోయిన్‌గా నటించిన ‘సరిపోదా శనివారం’లో ప్రియాంక మోహన్ మాత్రం కాస్త వైవిధ్యంగా ఈ పాటను వాడుకుంటోంది. ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో పలు నగరాల్లోనూ, గ్రామాల్లోనూ సినిమా యూనిట్ అంతా పర్యటించి, ప్రమోట్ చేస్తున్నారు. గత వారం రోజులుగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్న ప్రియాంక తన పర్యటనకు సంబంధించి ఓ రీల్ విడుదల చేసింది. దీనికి ‘దేవర’ మూవీలోని ‘చుట్టమల్లె’ సాంగ్ ఆడియోను యాడ్ చేసింది.