HealthHome Page SliderNational

జుట్టు రాలడాన్ని నిరోధించే అద్భుత పానీయం ఇలా చేసుకుందాం..

మహిళలను అధికంగా వేధించే సమస్య జుట్టు రాలడం. దీనికోసం రకరకాల ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని సార్లు సమస్య తగ్గకపోగా, పెరిగే ప్రమాదం ఉంది. దీనికోసం సహజ సిద్ధ పదార్ధాలతో తయారు చేసుకున్న ఆహారమే మంచి పద్దతి అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. దీనికోసం ఒక అద్భుతమైన పానీయాన్ని తయారుచేసుకోవచ్చు. దీనిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రత్ కథూరియా వీడియో రూపంలో పంచుకుంటే అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.

సబ్జాగింజలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, తామర గింజలు కాస్త వేయించుకుని, దానిలో ఖర్జూరాలు, బాదం పప్పులు వేసి నీరు పోసి, స్మూతీలా బ్లెండ్ చేసుకోవాలి. దీనిని వారానికి మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, జుట్టు ఒత్తుగా పెరుగుతుందని సిమ్రత్ పేర్కొన్నారు.