కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు..మండిపడ్డ బీజేపీ
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతు ఆందోళనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో బీజేపీ అధిష్టానం ఆమెపై మండిపడింది. ఆమె వైఖరిని తప్పుపట్టింది. పార్టీ విధానంపై వ్యాఖ్యలు, ప్రకటనలు చేయడానికి కంగనాకు గానీ, ఇంకెవరికీ గానీ అనుమతి, అధికారం లేదని స్పష్టం చేసింది. ఇంకెప్పుడూ అనవసర వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించినట్లు సమాచారం. రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉండొచ్చని, వారిని అదుపు చేయవలసిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించింది. లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడంతో పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.