Andhra PradeshHome Page Slider

వారికి కోటి రూపాయల పరిహారం…

ఏపీలో అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. మరో 60 మంది గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ సెజ్‌లో ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాలలో ఇదే అతి పెద్ద ప్రమాదం. విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల కుటుంబాలతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టానికి సహకరించాలని కుటుంబాలను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మూడు రోజులలోపే పరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స కొనసాగుతోంది. అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో 18 మందికి, అచ్యుతాపురంలోని ఆసుపత్రిలో 10 మందికి, విశాఖపట్నంలోని మెడికవర్‌లో ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. మృతదేహాలను విశాఖ కేజీహెచ్, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు విశాఖ చేరుకుంటారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను పరామర్శించి, అనంతరం ఘటనాస్థలాన్ని పరిశీలిస్తారు.