‘సరిపోదా శనివారం’లో ఆ పాత్రే ట్రెండ్..?
నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిద్దడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశారు. దీనికితోడు ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అభిమానుల్లో సినిమాపై పాజిటివ్ టాక్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ యూనిట్ అంతా బిజీ బిజీ.. కాగా, సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, చారులత అనే లేడీ కానిస్టేబుల్ పాత్రలో ఆమె నటిస్తోంది. అయితే, ఈ సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో ఆమె నటిస్తోందని.. అందుకే ఆమె పాత్రను ఎక్కడా రివీల్ చేయడం లేదని.. ట్రైలర్‌లోనూ ఆమెకు ఒక్క డైలాగ్ మాత్రమే ఉంటుందని ఓ వార్త.. దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాల్లో హీరోయిన్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీని ఆయన ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం సమకూరుస్తుండగా, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ పాత్రే కీలకం కానుందా అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకా కాని తెలియదు.

