ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై కసరత్తు..
ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బీమా విధానంలో అందించేందుకు కసరత్తులు చేస్తోంది. NTR వైద్యసేవ పేరుతో ఆరోగ్యశ్రీని అందిస్తోంది. బీమా కోసం ప్రతీ కుటుంబానికి రూ.1700 నుండి రూ.2000 ప్రీమియంను చెల్లించాల్సి రావచ్చని అంచనాలు వేసింది. ఈ ప్రీమియంను బీమా కంపెనీలకు ప్రభుత్వమే కట్టవలసి రావచ్చు. దీనితో ప్రభుత్వంపై ఏడాదికి రూ.3వేల కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల కింద వైద్యానికి ప్రస్తుతం పరిమితి రూ. 25 లక్షలుగా ఉంది. బీమా పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. రోగి వైద్యానికి ఆ మొత్తం దాటితే ప్రభుత్వం చెల్లిస్తుంది.