భారీ వర్షం కారణంగా ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. దీనితో రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే GHMCలోని అన్నిరకాల స్కూళ్లు, కాలేజీలకు డీఈవో నేడు సెలవు ప్రకటించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించి, ఆయా జిల్లాల డీఈవోలు, స్కూళ్ల యాజమాన్యాలూ, ఎంఈవోలూ కూడా సెలవు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. చిన్నారులు స్కూల్ కోసం భారీ వర్షాలలో వచ్చి ఇబ్బంది పడడమే కాకుండా డ్రైనేజీల సమస్య కారణంగా, ముంపు కారణంగా ప్రమాదాలు జరగవచ్చని విద్యాశాఖ హెచ్చరించింది.

