Home Page SliderNational

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఈయనే..

రాజ్యసభలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేశారు. సింఘ్వీని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన 2001 నుండి కాంగ్రెస్ జాతీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. గతంలో 2006, 2018లలో కూడా రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. జాతీయ రాజకీయాలలో సింఘ్వీ కాంగ్రెస్‌కు కీలకమైన సేవలు అందజేశారు.  ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.