హరియాణా, జమ్ముకాశ్మీర్ ఎన్నికలు ఎప్పుడంటే ?
జమ్ముకాశ్మీర్, హరియాణా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికలు ఇవే. 2014 తర్వాత జమ్ముకాశ్మీర్‌లో జరగనున్నఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2023 డిసెంబర్‌లో జమ్ముకాశ్మీర్‌లో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికలు మూడు దశలలో జరుగుతాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకాశ్మీర్ ప్రజలు చాలా ఉత్సాహంతో ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని ఈసీ పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో 90 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇకపోతే అక్టోబర్ 1న హర్యానా ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 4న ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా సమాచారం రావలసి ఉంది.