కేంద్ర ప్రభుత్వం అందించే ప్రెసిడెంట్ మెడల్‌కు తెలంగాణ నుండి 11 మంది పోలీసులు ఎంపికయ్యారు. వీరు చేసే వెలకట్టలేని సేవలకు గాను కేంద్రం మెచ్చి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారికి ప్రత్యేకంగా మెడల్ బహుకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతితో పాటు జమీల్ భాషా (కమాండెంట్), క్రిష్ణమూర్తి (ASP), నూతలపాటి జ్ఞానసుందరి (ఇన్స్పెక్టర్), కొమరబత్తిని రాము (SI), అబ్దుల్ రఫీక్ (SI), ఇక్రమ్ ఏబీ ఖాన్ (SI), శ్రీనివాస మిశ్రా (SI), కుంచల బాలకాశయ్య (SI), లక్ష్మయ్య (ASI), గుంటి వెంకటేశ్వర్లు (ASI) మొదలైనవారు ఉన్నారు.