స్వాతంత్య్ర దినోత్సవం పేరిట కొత్త మోసాలు
సైబర్ నేరం సరికొత్త పుంతలు తొక్కుతోంది. “కాదేదీ కవిత్వానికనర్హం” అన్నట్లు స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. ఆగస్టు 15 సమీపిస్తుండడంతో ఆన్‌లైన్‌లో డబ్బు కొట్టేయడానికి సరికొత్త ఎత్తుగడ వేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీకు గిఫ్ట్ వచ్చింద’టూ మెసేజ్ పెట్టి, అక్కడ ఉన్న లింక్ ను ఓపెన్ చెయ్యమని ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసారో ఇంతే సంగతులు. జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

