చీరల స్థానంలో క్యాష్?
టిజి: బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్రంలో చీరల పంపిణీకి స్వస్తి పలకాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో నగదు లేదా ఇతర గిఫ్ట్లు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో నిర్వహించనున్న సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దానిపైనా చర్చించిన తరువాత ఏ విషయం త్వరలో తెలుపుతానన్నారు.